Venkatagiri Municipality :: Property Tax Details

JAVA Language

Posted by Raja Rao T.J 11:10 PM, under |



JAVA Language - జావా అనేది సన్ మైక్రో సిస్టమ్స్ రూపొందించిన ఒక కంప్యూటర్ భాష. దీనిని 1995లో సన్ సంస్థ యొక్క జావా ప్లాట్ ఫాంలో ప్రధానమైన భాగంగా విడుదల చేశారు. దీని సింటాక్సు చాలా వరకు సీ, సీ ప్లస్ ప్లస్ పోలి ఉన్నప్పటికీ వాటికంటే సులభతరమైన ఆబ్జెక్టు మోడల్ ఆధారంగా అభివృద్ధి చేయబడింది. కానీ ఇది సీ/సీ ప్లస్ ప్లస్ లాగా క్రింది స్థాయి ప్రోగ్రామింగ్ చేయడానికి అంతగా అనుకూలించదు. జావా ప్రోగ్రాములు ఎక్జిక్యూట్ చెయ్యడానికి ముందు జావా కంపైలర్‌చే బైట్ కోడ్ లోకి తర్జుమా చెయ్యబడతాయి. ఈ బైట్ కోడ్ ఫైలును జావా వర్చువల్ మెషీన్ ఎక్జిక్యూట్ చేస్తుంది. జావా వర్చువల్ మెషీన్ అన్ని రకాలైన కంప్యూటర్లలో పనిచేసే విధంగా రూపొందించబడి ఉంటుంది కాబట్టి జావా డెస్కుటాప్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, పిడిఏలు మొదలైన అన్ని రకాల కంప్యూటర్లలో పని చేస్తుంది.

Archive

Archive