Venkatagiri Municipality :: Property Tax Details

పుదీనా

Posted by Raja Rao T.J 7:29 PM, under |



పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జిలకర, ఎండుద్రాక్ష, ఖర్జూరకాయలను కలిపి చట్నీలా తయారుచేసుకోండి. ఈ చట్నీని వాడితే ఉదరానికి సంబంధించిన వ్యాధులుంటే వెంటనే నయమౌతుంది. ఇది అన్నంలో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది. ఆకలి వేయకుండా ఉంటే లేదా భోజనం రుచించకుంటేకూడా ఈ చట్నీని ఆహారంగా తీసుకుంటే ఆకలి బాగా వేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

** దగ్గుతో బాధపడుతుంటే పుదీనా మరియు అల్లం రసంలో కాసింత తేనె కలుపుకుని సేవిస్తే దగ్గు మటుమాయమౌతుంది.
** తరచూ వెక్కిళ్ళు వస్తుంటే పుదీనాలో చక్కెర కలుపుకుని మెల్లగా నమలండి. కాసేపటికి వెక్కిళ్ళు తగ్గిపోతాయి.
** ఒకవేళ టాన్సిల్స్‌తో బాధపడేవారు పుదీనా రసంలో నీటిని కలిపి గరగరలాడిస్తే ఉపశమనం కలుగుతుంది.
** పగలంతా బయట తిరిగేవారు అరికాళ్లలో మంటలున్నాయని తరచూ ఫిర్యాదు చేస్తుంటారు. దీనికిగాను పుదీనాను రుబ్బిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచండి. ఫ్రిజ్‌లోనుంచి తీసిన ఆ పేస్ట్‌ను అరికాళ్ళకు పూయండి. ఇలాచేస్తే ఉపశమనం కలుగుతుంది.
** పచ్చి లేదా ఎండిపోయిన పుదీనాను మజ్జిగ, పెరుగు, పచ్చి మామిడికాయ ముక్కతో కలిపి సేవిస్తే కడుపులో ఏర్పడే మంటను దూరం చేయవచ్చు.
** విషపూరితమైన క్రిమికీటకాలు కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో పుదీనారసం పూస్తే ఫలితం ఉంటుంది. పుదీనాఆకులను నమిలితేకూడా ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
** ముఖంపై మొటిమలు లేదా మచ్చలుంటే మార్కెట్లో లభించే విలువైన క్రీములకన్నా పుదీనారసాన్ని పూస్తే ఉపశమనం కలుగుతుంది. పుదీనాఆకులను రుబ్బి ఇందులో కాసింత రోజ్‌వాటర్ మరియు నిమ్మకాయరసం కలుపుకోండి.
ముఖం కడుక్కుని నిద్రపోయేముందు ఈ పేస్ట్‌ను ముఖానికి పూయండి. ఎండిపోయిన తర్వాత చల్లటినీటితో ముఖాన్ని కడిగేయండి. నియమానుసారం ఇలా రెండు-మూడు వారాలపాటు చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలుంటే తొలగిపోయి ముఖారవిందం వికసిస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు

Archive

Archive