** శరీర చర్మం మంటల్లో కాలినట్లుంటే దానిపై పచ్చి క్యారెట్‌ను రుబ్బి ఆ పేస్టును కాలినగాయాలపై పూయండి. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాలిన చోట ఈ పేస్టును పూయడంతో మంట తగ్గి చల్లగా ఉంటుంది. గాయంకూడా త్వరగా మానుతుందంటున్నారు వైద్యులు.
** మేథో సంపత్తిని పెంచుకునేందుకు క్యారెట్టు మురబ్బను ప్రతిరోజూ ఉదయంపూట తీసుకోవాలంటున్నారు వైద్యులు.
** రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవించండి. రక్తహీనత తగ్గిపోతుంది.
** క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి నిత్యం కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి. ఇలా రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపైనున్న ముడుతలు మటుమాయం అవుతాయంటున్నారు వైద్యులు.
** క్యారెట్‌ను రుబ్బుకుని దానిని పెనంమీద వేసి కాసింత వేడి చేసి గాయాలై పూస్తే పుండ్లు మటుమాయమవుతాయంటున్నారు వైద్యులు.
** నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవించండి. దీంతో మీకున్న నిద్రలేమి మటుమాయమవుతుందంటున్నారు వైద్యులు.
** క్యారెట్టును నిత్యం సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయంటున్నారు వైద్యులు. ఇది ప్రేగుల్లో పేరుకుపోయిన మలాన్ని శుద్ధి చేస్తుంది.
** గుండెల్లో మంటగా ఉంటే క్యారెట్‌ను ఉడకబెట్టండి. దానిని చల్లార్చిన తర్వాత ఒక కప్పు రసంలో ఒక చెంచా తేనెను కలిపి సేవించండి. దీంతో గుండెల్లో మంటగా ఉంటే అది మటుమాయం అవుతుందంటున్నారు వైద్యులు.
** పిల్లల కడుపులో నులిపురుగులుంటే వారికి క్యారెట్‌ను తినిపించండి. దీంతో నులిపురుగులు బయటకు వచ్చేసి కడుపు శుభ్రంగా ఉంటుంది.
** నిత్యం క్యారెట్ తింటుంటే రక్తలేమితో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది.

