వేల సంవత్సరాల క్రితమే తెనెతో లాభాలున్నాయని చాలామంది వైద్యులు, విద్వాంసులు తెలిపారు. తెనెను సేవిస్తే అనేక రోగాలు మటుమాయమవుతాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు.
స్వచ్ఛమైన తేనె సువాసనలు వెదజల్లుతుంది. వేడిని చూపిస్తే ఇది కరిగిపోతుంది. అలాగే చలికాలంలో చిక్కదనాన్ని పొందుతుంది. అదే అశుద్ధమైన తేనె పాత్రలో వేసినవెంటనే పాత్రంతా వ్యాపిస్తుంది.
తేనె గుణాలను తెలుసుకుందాం
** హ్రుదయంలోని ధమనులకు ఇది చాలా బలవర్ధకమైంది. రాత్రి పడుకునేముందు తేనెను నిమ్మరసంతో కలిపి తీసుకుంటే బలహీనంగానున్న గుండెకు ఎంతో లాభదాయకం అంటున్నారు ఆరోగ్యవైద్యనిపుణులు.
** తేనెను పాలతోగాని, టీతోగాని కలిపి తీసుకుంటే కడుపులోనున్న చిన్న చిన్న గాయాలు, ప్రారంభపుదశలోనున్న అల్సర్ మటుమాయమవుతాయి.
** పొడి దగ్గున్నవారు తేనెతో కలిపిన నిమ్మ రసం సమపాళ్ళలో తీసుకుంటే లాభదాయకం.
** తేనె తీసుకుంటే మాంసకృతులు బలవర్ధకంగా మారుతాయి.
** శ్వాసకోసవ్యాధులతో బాధపడేవారు అల్లం రసంతోబాటు తేనెను సమపాళ్ళల్లో తీసుకుంటే శ్వాసకోస వ్యాధినుంచి బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఎక్కుళ్ళతో బాధపడేవారికికూడా ఇది ఎంతో లాభదాయకం.
** ఒక గ్లాసు పాలలో చక్కెర లేకుండా తేనెను కలిపి రాత్రిపూట సేవిస్తే బలహీనంగా ఉండేవారు పుష్టిగా తయారౌతారంటున్నారు వైద్యులు.
** ఉల్లిపాయ రసం తేనె సమపాళల్లో కలిపి తీసుకుంటే కఫం తగ్గిపోతుంది. పేగులలోనున్న క్రిములు నష్టపోయి ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు తెలిపారు.

