Venkatagiri Municipality :: Property Tax Details

శరీర కాంతి పెంచే చిట్కాలు

Posted by Raja Rao T.J 9:09 PM, under |





• నిమ్మరసము, మజ్జిగ సమబాగాలు కలిపి పూయుట వలన ఎండకు నల్లబడిన ముఖము స్వచ్చముగా నుండును.
• ఆవ నూనెలో శనగపిండి, పసుపు కలిపి రాసిన చర్మము కాంతివంతమగును.
• వెన్న, పసుపు కలిపి రాత్రిపూట నిద్రపోవునప్పుడు ముఖమునకు రాసుకొనిన ముఖము కాంతివంతముగాను ఉండును.
• ముఖము పై ముడతలున్న రెండు చెంచాల గ్లిజరిన్ లో 1/2 చెంచా గులాబీ జలము, కొన్ని నిమ్మరసపు చుక్కలు కలిపి రాత్రి ముఖముపై రాయవలెని. ఊదయము లేవగానే చన్నీటితో ముఖము కడుగుకొనవలెను. చరమపు రంగు నిగ్గుతేలి ముడతలు తగ్గిపోవును.

• చర్మానికి కుంకుమ పువు సొగసు : కుమ్కుమ పూవు అత్యంత ఖరీదే అయినా ప్రపంచ స్థాయిలో సౌంధర్య సాదనగా ప్రసిద్ధిపొందినది. కుంకుమపూవుతో తయారయిన పేస్టుని ముఖము చేతులపైన రాసుకుంటే చర్మానికి మ్రుదుత్వాన్ని,బంగారు మెరుపుని తెస్తుంది.అందుకే గర్భినిగా ఉన్నవారుకుంకుమ పూవు పాలలో వేసుకొని తాగితే మంచి ఛాయతో మెరిసిపోయే బిడ్డపుడుతుందని నమ్ముతారు.

• పసుపు, వేపల లేపనము : వమ్దల సంవస్తరాల నుంచి భారతీయులు చర్మ సంరక్షణకు పసుపు, వేపలను ఎమ్తగానో నమ్ముతారు.పలురకాల చర్మ సమస్యలకు విరుగుడుగా పనిచేయడమే కాకుండా చర్మానికి చల్లదనాన్ని , హాయినీ ఇస్తుంది. ఒక చెంచా పసుపు పొడి, కొంచము కుంకుమ పొడి,ఒక చెంచావేపచూర్నము పచ్చి పాలలో వేసి కలిపి మిశ్రమాన్ని తయారుచేసి ముఖము ,ఇతర చర్మభాగాల మీద రాస్తే మచ్చలు దద్దుర్లు వంటివి పోతాయి.

• గంధము పేస్టు : కొంతమంది చర్మము బాగా సున్నితముగా ఉంటుంది, ఏమాత్రము ఎండలోకి వెళ్లినా కందుతుంది, దురద,పొడిబారడం,పొరలుగా రావడం, బిరుసెక్కిపోవడం,వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటపుడు గంధము పేస్టు ఆయిల్ చర్మాన్ని చల్లబరుస్తుంది,యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది, చర్మాన్ని తేమగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ప్రతి రోజూదీనిని వాడుతూ ఉంటేచర్మము మీది నూనెగ్రంధులు ఉత్తేజితమై తేమగా ఉండేందుకు తోడ్పడుతూ చర్మాన్ని హానిచేసే బాక్టీరియాను తొలగిస్తాయి.

• ముడతలు పడకుండా నిమ్మకవచం : కోసిన యాపిల్ ముక్క బూడిద రంగులోనికి మారకుండా ఉండాలంటే నిమ్మరసాన్ని కోసిన యాపిల్ భాగములో నిమ్మరసానీ రాస్తుంటాము, ఆక్షిడేషన్ కారణముగా యాపిల్ అలా మారకుండా ఊంటుంది. వాతావరణ కాలుష్యానికి గురైన చర్మము పాడవకుండా ఆపే శక్తి నిమ్మరసము లోని విటమిను 'సి' కి ఉన్నది. ప్రతి సౌంధర్య సాధనానికి రెండు నిమ్మ చుక్కలు కలిపితే చర్మము ముడతలు పడకుండా ఉంటుంది.

• జుట్టుకి గొప్ప కండిషనర్ పెరుగు : పెరుగు జుట్టుని పొడిబారనీయకుండా చేస్తుంది. షాంఫూతో తలంటుకున్న తరువాత ఐదునిముషాలు పెరుగుతో తలకు మసాజ్ చేసుకుంటే పొడిబారిన , పాదైన జుట్టూకి చక్కని కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టుకి మ్రుదుత్వాన్ని ఇచ్చి తేమగా ఉంచే శక్తి పెరుగుకి ఉంది.

Archive

Archive