Venkatagiri Municipality :: Property Tax Details

నల్ల శోబి

Posted by Raja Rao T.J 1:37 AM, under |


దీనినే మంగు లేదా ' నల్ల శోబి ' , నల్ల మచ్చలు అంటారు . ఇవి శరీరం అంతటా వచ్చినా ముఖము పైనే స్పష్టము గాకనిపిస్తాయి . ఇవి ఎలాంటి నొప్పిని , భాదను కలిగించవు కాని మానసికంగా ఆ వ్యక్తు లను స్థిమితం గావుండనివ్వవు .
ఎందుకు వస్తాయి :
మన శరీరం లో చర్మ రంగుకు కారణమయ్యే 'మెలనిన్' అనే వర్ణ ద్రవ్యం ఉంటుంది .. దీన్ని మేలనోసైట్ లుతాయారు చేస్తాయి . ఈ కణాలూ చర్మం లేనే కాదు .. జుట్టు , శ్లేష్మపు పొరలు , గోళ్ళు , మెదడు కణజాలం , గుండెకండరాలు , కంటి నిర్మాణము లోను ఉంటాయి . ఎ కారణం చేతనైనా చర్మం లోపల మెలనిన్ ఎక్కువగాతయారైతే .. అది అసాధారణం గా పేరుకు పోయి అది ' హైపర పిగ్ మెంటేషన్ ' కి (మగు కి) దారి తీస్తుంది . నిజానికి ఇది స్వేయరక్షణ కోసం జరిగే చర్య ... అంటే సుర్యకిరనాల్లోని' అతినీలలోహిత 'కిరణాలు (ultraviotetrays) చర్మానికి తాకితే కాన్సెర్ కు కారణము అవుతాయి ... అలా జరుగ కుండా ఉన్దేండు కే .. మనము ఎండలో కివెళ్ళగానే మెలనిన్ స్రవించి ఆకిరణలను అడ్డుకుంటాయి . అ విధంగా ఎండలోనికి వెళ్ళగానే చర్మంనల్లబడుతుంది . కొన్ని కారణాలు వలన ఈ మెలనిన్ అక్కడక్కడ పేరుకు పోయి మచ్చలు గా ఏర్పడతాయి .
కారణాలు :
అతిగా ఎండా , జీవ క్రియ లో తేడాలు , హార్మోన్ల సమస్యలు , జన్యులోపాలు , పోషక ఆహరం లోపం ., కొన్నిలోహాలు , రసాయనాలు , ఔషధాలు , అనుధార్మికత , అధిక ఉస్ణొగ్రత మున్నగునవి .

Archive

Archive