స రి గ మ ప ధ ని స
స: దీనిని షడ్జమం అని కూడా అంటారు. మిగిలిన ఆరు స్వరాలకీ ఇదే ఆధార స్వరం. ఈ స్వరం నెమలి కూత నుండి పుట్టింది.
రి: రిషభం అంటే ఇదే. ఇందులో మూడు రకాలు ఉన్నాయి.రి1, రి2, రి3 అంటారు వీటిని. ఈ స్వరం వృషభ ధ్వని నుండి పుట్టింది.
గ: గాంధారం అంటారు దీనిని. ఇందులో కూడా గ1,గ2,గ3 అని మూడు రకాలున్నాయి. ఇది మేక స్వరం నుంచి పుట్టింది.
మ: దీనిని మధ్యమం అంటారు. మ1,మ2 అని రెండు రకాలు. క్రౌంచ పక్షి స్వరం నుండి పుట్టింది.
ప: పంచమం దీని పేరు. ఇందులో రకాలు లేవు. వసంత ఋతువులో కోకిల పంచమ స్వరంలో కూస్తుంది.
ద: దైవతం. ద1,ద2,ద3 అని మూడు రకాలు. గుఱ్ఱము ధ్వని నుంచి పుట్టింది.
ని: నిషాదం అంటారు. ఇది కూడా ని1,ని2,ని3 అని మూడు రకాలు. యేనుగు ఘీంకారం నుంచి పుట్టింది.
స = షడ్జమం (నెమలి క్రేంకారం)
రి = రిషభం (ఎద్దు రంకె)
గ = గాంధర్వం (మేక అరుపు)
మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
ప = పంచమం (కోయిల కూత)
ధ = ధైవతం (గుర్రం సకిలింత)
ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)
ఆరోహణ: తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.
ఉదా: స రి గ మ ప ధ ని స.
అవరోహణ: ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.
ఉదా: స ని ధ ప మ గ రి స.
-:రాగం:-
సాధారణంగా ఒక రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలన్న ఒక నియమం ఉంది. కానీ బాలమురళీకృష్ణ గారు నాలుగు స్వరాలనే వినియోగించుకోని రాగాలను కూర్చారు.ఈ రాగాల కూర్పుతోనే భారతీయ సంగీతం, సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యకతను నిలుపుకోగల్గుతున్నదని అంటారు.
-:శృతి:-
స్వరాలకు ఆధారం శ్రుతుల. ,శ్రుతి అంటే ధ్వని విశేషం.సంగీతానికి పనికి వచ్చే శ్రుతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం)కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది.
-:తాళం:-
సంగీతంలో వినిపించే మరోధ్వని విశేషం తాళం. దీనినే లయ అని కూడా అంటారు. శ్రుతి లయలు సంగీత మాధుర్యానికి ఆధారాలు. అట్టి తాళంలో కూడా రకాలున్నాయి.
ఆది తాళం 8 మాత్రలతో కూడింది. చుతాళ లేక ఏక తాళం 12 మాత్రలతో కూడింది. జపతాళ 10 మాత్రలతో, రూపక్ తాళ 7 మాత్రలతోను, తీన్ తాళ 16 మాత్రలతో కూడినది.