oracle database-ఒరాకిల్ డేటాబేసు
ఒరాకిల్ డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ రకానికి చెందినది. ఈ రకమైన డేటాబేస్ లలో సమాచారాన్నిపట్టికలు (టేబుల్స్) ల లో భద్రపరుస్తారు. ప్రపంచ డేటాబేస్ విపణిలో ఒరాకిల్ సింహభాగాన్ని ఆక్రమిస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ను తయారు చేసిన ఒరాకిల్ కార్పొరేషన్ ప్రపంచ సాఫ్ట్ వేర్ కంపెనీలలో రెండవ అతి పెద్ద కంపెనీ. (మొదటిది హెచ్.పి)
1977 లో లారీ ఎల్లిసన్ మరియు ఆయన మిత్రులు కొంతమంది కలిసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లాబొరేటరీస్ అనే ఒక సంస్థను నెలకొల్పారు.1979 లో దాన్ని రిలేషనల్ సాఫ్ట్‌వేర్ గా మార్చారు.అప్పుడే ఒరాకిల్ డేటాబేస్ రెండవ వర్షన్ విడుదలైంది. అయితే అందులో లావాదేవీలకు (ట్రాన్సాక్షన్లకు) ఆసరా ఉండేది కాదు. కేవలం సీక్వెల్ ఆధారంగా డేటాబేస్ నుంచి సమాచారాన్ని ప్రశ్నించి వెలికి తీయడం(క్వెరీ చెయ్యడం), డేటాబేసులోని పట్టికలను కలపడం వంటి ప్రాథమిక అవసరాలను మాత్రం తీర్చగలిగారు

