Venkatagiri Municipality :: Property Tax Details

Poleramma Jathara Venkatagiri

Posted by Raja Rao T.J 10:49 PM, under |

వెంకటగిరి రాజ్యం ఆవిర్భావం - పోలేరమ్మ జాతర:
Venkatagiri Poleramma Jathara



కలిమిలి నామదేయంతో రాజ్యపాలన చేస్తున్న చంద్రగిరి రాజైన వెంకటపతి రాజు మామ గొబ్బూరి జగ్గరాజును కర్నూలు జిల్లా వెలుగోడు పాలకులు, శ్రీకృష్ణ దేవరాయ ప్రతినిధి అయిన వెలుగోటి వెంకటాద్రి నాయుడు గొబ్బూరి జగ్గరాజును దాడిచేసి కలిమిలి నుంచి వెళ్లగొట్టారు. తరువాత ఈచోటనే వైష్ణవ నామధేయమైన వెంకటగిరి పేరుతో కిశకం 1600 పూర్వం రాజ్య నిర్మాణం జరిగింది. వెంకటగిరి సంస్ధాధీశులు, కాకతీయుల లాగా పోలేరమ్మను ఇలవేల్పుగా భావించలేరు. అందువల్ల వెంకటగిరి సంస్ధానాధీశులు ఏ రీతుగా పోలేరమ్మకు జాతర చేస్తున్నారో తెలుసుకోవడం సందర్భోచితం.

వెంకటగిరి సంస్ధానం మాలవాడైన రేచడు బలిదానంతో కీశకం 1170 - 1210 ప్రాంతంలో తెలంగాణాలోని నల్గొండ జిల్లా ఆమనగల్లులో తొలి రాజ్యస్ధాపన జరిగింది. వెంకటగిరి సంస్ధానాదీశుల మూల పురుషుడు చెవిరెడ్డి. ఇతని పేరుతోనే వెంకటగిరిలో చెవిరెడ్డిపల్లి గ్రామం ఉన్నది. ఇతడు బేతాళుని అంశంతో ధన, ధాన్యరాశులు పొందటానికి సేద్యగాడైన రేచడు బలికావడం జరిగింది. తన బలికావడానికి ముందు చెవిరెడ్డి కొన్ని కోరికలు కోరడం జరిగింది. వాటిలో భాగమే తన పేరుతో వెంకటగిరి సంస్ధానాదీశులు గోత్రం ఏర్పాటుచేయడం, సంస్ధానాదీశుల వారసుల వివాహాల సందర్భంగా రేచడి జాతి వారికి వివాహం జరిపించి వారి అక్షింతలు చల్లుకోవడంతోపాటు తన ఇలవేల్పు, ఇష్ట దైవమైన పోలేరమ్మకు జాతర జరిపించేటట్లుగా వరం కోరినట్లుగా తెలుస్తున్నది. అందువల్లనే వెంకటగిరి సంస్ధానాదీశులు కీశకం 1601 ప్రాంతంలో నేటి బాలాయపల్లి మండలంలోని మన్నూరు గ్రామానికి యాచసముద్రం అనే పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే జాతర ఇక్కడ చేస్తున్నారు. వెంకటగిరి సంస్ధానాదీశులలో 33తరాల వారు పోలేరమ్మ జాతరను జరిపించడం విశేషం. 1992 నుండి పోలేరమ్మ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి రాబడి, వారి ఆధ్వర్యంలో జాతర జరుగుతున్నది.
పోలేరమ్మ జాతరపై తొలి పుస్తకం:
వెంకటగిరి పోలేరమ్మ జాతర చరిత్రపై ప్రప్రధమంగా ‘‘ గ్రామశక్తి పోలేరమ్మ జాతర చరిత్ర ’’ పేరుతో ప్రముఖ న్యాయవాధి, పరిశోధకులు పెనుబాకు వేణు 2003వ సంవత్సరంలో రచించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇది జాతరపై సమగ్ర గ్రంథం. ఇది ఎందరో పరిశోధకులకు, విద్యార్ధులకు జాతర ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. రచయిత పెనుబాకు వేణు కలం నుండి నెల్లూరుజిల్లా గ్రామనామ నిఘంటువు, అక్షరరూపం దాల్చనున్నది

Archive

Archive