పూర్ హౌస్ (పేదలకు అన్నదాన సత్రం)దీనినే జగన్నాధ అన్నదాన సత్రం అని అంటారు. ఈ పూర్ హౌస్ ఎంతో మంది పేదలకు ఆకలిని సమృద్ధిగా ప్రతిరోజూ తీర్చేది. ఇంతటి మహత్త్ మానవీయ కార్య క్రమాన్ని చేపట్టి ప్రజల నీరాజనాలు అందుకున్నారీయన, తరువాత ఈయన వారసులు దాదాపు 105 సం వరకు అన్నదాన సత్రంను నడిపారు.
ఈయన పిన్న వయస్సులోనే పట్టాభిషిక్తుడైనారు. ఈయన గొప్ప మానవతావాది, పరీశీలకులు, వేదాంతి, సాహిత్యాభిమాని, విద్యాప్రసాదకులు వెంకటగిరి రాజాలలో ఈయన పరిపాలనా శైలి ప్రత్యేక ముద్ర.
ఈయన పరిపాలన దక్షతకు ముగ్ధులైన అనాటి బ్రిటిష్ రాణి గారు ‘‘ స్టార్స్ ఆఫ్ ఇండియా ’’ అనే బిరుదునిచ్చి సత్కరించారు.
సాహిత్య పరవళ్ళు :`- కవులను ఎంతో ఆదరించి వారికి ఎనలేని ప్రోత్సాహం అందించెడివారు.
మనసాక్ష్య తత్త్వం :- ఈయన అనేక గ్రంధాలను పరిశోధించి, (ఈయన కాలంలో రాజా వారి గ్రంధాలయంలోకి ఎన్నో పుస్తకాలు వచ్చి చేరాయి) , తను ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు దీనిని గ్రంధస్తం చేసి ప్రచారనిమిత్తము ‘‘ మససాక్ష కూటమి’’ అనే భవనాన్ని నగర నడిబొడ్డున నిర్మించారు, ఇందు కోసం ధర్మనిధిని ఏర్పాటు చేశారు.
