కీ.శ 1600 సంవత్సరములో కర్నూలు జిల్లా వెలుగోడు నుంచి వచ్చిన వెంకటాద్రినాయుడు అను రాజు మొట్టమొదట వెంకటగిరికి వచ్చి ఇప్పటి కలివేలమ్మ గుడి దగ్గర కలిమిలి అను పేరుతో గ్రామము ఉండేది. దీనిని గొబ్బూరులు అను జమీందారులు పరిపాలించుచుండిరి. వారిని వెంకటాద్రినాయుడు వారిని జయించి రాజ్యమును స్థాపించిరి. ఈయన వెంకటేశ్వరుని భక్తులు కావడం వీని నామధేయం కూడా అదేకావడం, మరియు వెలిగొండలు వెంకటగిరి నుంచి తిరుమల వరకు వ్యాపించివుండం తో ఈ కలిమిలిని వేంకటగిరి గా మార్చినారు.
ఆనాడు వెంకటగిరి రాజ్య సంస్థానం 736 గ్రామలు మరియు 617మజరా గ్రామాలతో అలనాడు రాజిల్లింది.
