Venkatagiri Municipality :: Property Tax Details

పద్మశ్రీ ఘంటసాల కళాక్షేత్రం – వెంకటగిరి.

Posted by Raja Rao T.J 2:16 AM, under |

ఘంటసాల గూర్చిన మా వాఖ్యానము :-
ఉదయ సంధ్యా వందనముతో ‘‘దినకరా శుభకరా’’ అంటూ సూర్య భగవానుని స్తుతించినా, ‘‘ కౌసల్య తనయ పూర్వ సంధ్యా ప్రవర్తతే’’ అని ఆ ఏడు కొండల శ్రీనివాసులును మేల్కొకొల్పినా, ‘‘ మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ’’ అని నిద్రావస్థలో వున్న సమాజాన్ని జాగృత పరిచి, జీవితము మీద నిరాశ చెందిన జీవులకు ‘‘ కళకానిది విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలతో బలిచేయకు ’’ అని బ్రతుకు విలువలు నేర్పిన, రోజంతా శ్రమపడి వచ్చిన శ్రామికునికి ‘‘ శ్రమ జీవికి జగమంతా లక్ష్మీ నివాసం ’’ అని ఊరట నింపినా, ‘‘ఘనా ఘనా సుందరా ’’ అంటూ ఆథ్యాత్యిక పరిమళాలు వెదజల్లినా, ‘‘ తెలుగు వీరా లేవరా – దీక్ష బూని సాగార ’’ అంటూ దేశభక్తిని నింపినా, ‘‘ ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి – ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి’’ అంటూ ఇల్లాలి ఔన్నత్యాన్ని కీర్తించినా, ‘‘ అమ్మా అని అరచినా ఆలకించవేవమ్మ’’ అంటూ తల్లి తండ్రుల గూర్చి నివేదించినా, ‘‘ జగమే మాయ – బ్రతుకే మాయ’’ అని ‘‘మనసు గతి ఇంతే – మనిషి బ్రతుకింతే’’ సామాన్యునిలో వేదాంతాన్ని నిద్దుర లేపిన, ‘‘ భగవద్గీత’’ తో భగవత్ సారాన్ని జగమంతా పలికించినా ఇది కేవలం మన ఘంటసాల గళానికే సాధ్యం, అందుకే ప్రతి ఒక్కరికి ఘంటసాల పాట అవసరం, పాడుకోవాలి, పాడించాలి, వినాలి, వినిపించాలి రాబోవు తరాలకు ఈ పాటలకు ఓ స్థిరాస్థి గా ఇవ్వాలి.
ఘంటసాల వారి పాటలు నేటి తరం లోని వారు కూడా ఆయన పాటల చల్లదన్నాని చవిచూసి పరవశించాలని అనే ఆకాంక్షతో సుస్వర లలిత కళాక్షేత్రం, వెంకటగిరి పాతకోటలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థాన మండపము నందు 11-02-2001న ఘంటసాల గారి వర్థంతి సందర్భముగా వెంకటగిరి లోని ఔత్సాహికులైన యువకులచే ప్రారంభించడమైనది.

Archive

Archive