Venkatagiri Municipality :: Property Tax Details

ఆధ్యాత్మిక వేత్త - రచయిత : శ్రీ రావినూతల రాధాకృష్ణయ్య

Posted by Raja Rao T.J 2:23 AM, under |

శ్రీ రావినూతల రాధా కృష్ణయ్య గారు ఆర్.వి.యం హైస్కూల్ హెడ్ మాష్టారు ఆధ్యాత్మిక వేత్త ; రచయిత మరియు మంచి వక్త గా పేరు పొందారు; అందరికి సుపరిచితులు (జననం ఏఫ్రియల్ 11- 1933 – మరణం డిశంబరు 24-1991)
ఆథ్యాత్మిక రచయితగా ఈయన పై తన గురువుగారైన శ్రీ స్వామి శివానంద స్వామి సరస్వతి(రుషికేష్) ప్రభావం ఈయన రచనలలోను మరి ముఖ్యంగా జీవనవిధానంలో కనిపస్తుంది. ఆయన శిష్యరికం మహా భాగ్యంగా ఆయన రచనలలో తెలియజేశారు. రచనలలో ముఖ్యమైనవి ఈశావాశ్య ఉపనిషత్తు; శ్వేతాశ్వతర ఉపనిషత్తులకు భజ గోవిందం; ముకుందమాల వంటి గ్రంధములకు సరళమైన వాఖ్యానములు చేశారు. అంతేగాక ఈయన మంచి అనువాదకులు ఎన్నో క్లిష్టమైన రచనలను ఆంగ్లములోకి అనువదించిన ఘనత వీరికి ఉన్నది.
ఆథ్యాత్మిక వేత్తగా :- శ్రీ స్వామి శివానంద గారి రచనలను మొత్తం 300 అన్నిటి యందు నిష్ణాతుడై; ఎన్నో ఉపన్యాసములు ; గీతా ను ప్రవిచించడంలో ఈయన మేటి అంతేగాక వెంకటగిరిలో ప్రపథముగా గీతోపన్యాసమును గావించినవారు. సాథనరత్న అనే బిరుధును వారి గురువు గారి ద్వారా పొందడం మహా విశేషం.
హెడ్మాష్టరు గా :- వెంకటగిరి రాజా వారి స్కూల్ నందు పనిచేశారు; ఈయన సంతానం మొత్తం 8 మంది కాగా అందరూ ఉపాధ్యాయ వృత్తిలో తనయులు, కుమార్తెలు మరియు అళ్ళుల్లు కూడా వుండటం విశేషం, 5వ తనయుడైన (శ్రీ శివ నారాయణ) లో ఈయన శైలులు కనిపిస్తాయి ఆద్యాత్మికంగా.
శ్రీ రావినూతల రాధాకృష్ణయ్య గారి రచలను ఎ.పి గవర్నమెంట్ వారు వరల్డ్ డిజిటల్ లైబ్రరీ లో వుంచుటకు అనుమతిని వీరి కుంటుంబ సభ్యుల ద్వారా తీసుకొని డిజిటల్ లైబ్రరరీ నందు వుంచియున్నారు.

Archive

Archive